Andhra Pradesh: ఫిబ్రవరి 1న ‘ఏపీ బంద్’.. పరోక్షంగా మద్దతు ప్రకటించిన చంద్రబాబు!

  • ఆరోజు జన్మభూమి కార్యక్రమం వాయిదా
  • అమరావతిలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • పాల్గొన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు

జన్మభూమి సమావేశాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అన్న క్యాంటీన్ల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రకృతి సేద్యంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అమరావతిలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ‘ప్రత్యేకహోదా సాధన సమితి’ వచ్చే నెల 1న చేపట్టనున్న ఏపీ బంద్ కు చంద్రబాబు పరోక్షంగా మద్దతు తెలిపారు. బంద్ కు సంఘీభావంగా ఆరోజు నిర్వహించాల్సిన జన్మభూమి సమావేశాలను ఫిబ్రవరి 2,3,4 తేదీలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

  • Loading...

More Telugu News