Ashok gajapathi raju: దగ్గుబాటితో కలిసి పనిచేశా.. అది ఆయన విజ్ఞత: అశోక్ గజపతి

  • ప్రతి పనిలోనూ మంచి చెడు ఉంటాయి
  • ఎవరు ఎవర్ని కలిసినా ప్రయోజనం లేదు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం

ఏపీ ప్రభుత్వంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన విమర్శలపై కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు స్పందించారు. గతంలో దగ్గుబాటితో తాను పనిచేశానని పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయన్నారు. వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి కలవడం, ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు. ఎవరు ఎవర్ని కలిసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. కాగా, ఆదివారం ‘ఎన్టీఆర్ ఎ బయోపిక్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న అశోక్ గజపతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని మరోమారు స్పష్టం చేశారు.

Ashok gajapathi raju
Telugudesam
Daggubati Venkateswara Rao
Jagan
YSRCP
  • Loading...

More Telugu News