priya prakash varrier: ఇప్పటికి 200 సార్లు కన్ను కొట్టాను... ఇంకానా.. బోర్ బాబోయ్!: నటి ప్రియా ప్రకాశ్

  • కన్ను కొట్టీ కొట్టీ బోర్ కొడుతోంది
  • సినిమా విడుదలకు ముందే బోల్డన్ని ఆఫర్లు
  • కొంత ప్రైవసీ కోల్పోయిన మాట నిజమే

తాను ఇప్పటి వరకు 200 సార్లు కొట్టానని, తానెక్కిడికి వెళ్లినా ఇంకా కన్ను కొట్టమని అడుగుతున్నారని మలయాళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పుకొచ్చింది. ఎవరైనా ఇప్పుడు కన్నుకొట్టమని అడిగితే చిరాకు రావడం లేదు కానీ బోరింగ్‌గా అనిపిస్తోందని పేర్కొంది. ఒక్కసారి కన్ను కొట్టి దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ మాలీవుడ్ ముద్దుగుమ్మ నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమా ఇప్పుడు తెలుగులో ‘లవర్స్ డే’గా రాబోతోంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రియ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.  

తాను కన్నుకొట్టడం ఇంత వైరల్ అవుతుందని అప్పట్లో తాను ఊహించలేకపోయానని ప్రియ తెలిపింది. ఈ సినిమా తర్వాత తన జీవితంలో పెను మార్పులేమీ జరగలేదన్న ఆమె తానిప్పటికీ మిడిల్ క్లాస్ అమ్మాయినేనని పేర్కొంది. కాలేజీకి వెళ్లేందుకు లోకల్ బస్సుల్లో ప్రయాణించడానికే మొగ్గుచూపుతానంది. తానెక్కిడికి వెళ్లినా అభిమానులు సెల్ఫీలు అడుగుతుంటారని, దీంతో కొంత ప్రైవసీ కోల్పోయిన మాట నిజమేనని వివరించింది.  

‘ఒరు అదార్ లవ్’ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోందని, ఇప్పటి నుంచే తనకు కంగారుగా ఉందని పేర్కొంది. ఈ సినిమా విడుదలకు ముందే తనకు బోల్డన్ని  ఆఫర్లు వచ్చాయని తెలిపింది. దర్శకుడు అట్లీ తనకు వీరాభిమాని అని, విజయ్ సేతుపతితో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టిన ఈ అమ్మడు ‘ఐటెం సాంగ్స్’ చేయడానికి తనకు అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

priya prakash varrier
Malayalam
Actress
Lovers day
Tollywood
  • Loading...

More Telugu News