doctor: బెడిసికొట్టిన ప్రేమ వ్యవహారం.. ఆసుపత్రిలోనే ఉరివేసుకున్న యువ డాక్టర్!

  • విజయవాడలోని సూర్యారావుపేటలో ఘటన
  • స్టార్ హోమియో ఆసుపత్రిలో చేరిన విశాల్
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి లోనైన ఓ యువ డాక్టర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పనిచేస్తున్న ఆసుపత్రిలోనే సీలింగ్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న స్టార్ హోమియో ఆసుపత్రిలో విశాల్ యాదవ్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ రెండు రోజుల క్రితమే ఆయన విధుల్లో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన విశాల్ గతకొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నారు.

అయితే వీరి ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. చివరికి పనిచేస్తున్న ఆసుపత్రిలోనే సీలింగ్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

doctor
suicide
Andhra Pradesh
Vijayawada
love failure
  • Loading...

More Telugu News