Andhra Pradesh: వైసీపీకి మాస్టర్ స్ట్రోక్.. టీడీపీలో చేరనున్న విజయసాయిరెడ్డి బావమరిది!

  • అమరావతికి చేరుకున్న ద్వారకనాథ్ రెడ్డి
  • నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం
  • ఫలించని వైసీపీ సీనియర్ నేతల మంతనాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటా రెడ్డి ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా చురుగ్గా పావులు కదుపుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది.

గత కొంతకాలంగా పార్టీలో సీనియర్ల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో రాయబారం నడిపారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది కావడం గమనార్హం.

ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రోజు ఉదయమే ద్వారకనాథ్ రెడ్డి అమరావతికి చేరుకున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Vijay Sai Reddy
brother in law
dwarakanath reddy
  • Loading...

More Telugu News