Telugudesam: ఎన్నికలంటే ఎలా ఉంటాయో రానున్న ఎన్నికల్లో చూపిస్తా: కాకాణికి సోమిరెడ్డి సవాల్

  • మనుబోలులో పర్యటించిన మంత్రి 
  • కాకాణి-సోమిరెడ్డి మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
  • టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 300 కుటుంబాలు

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి-ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరి సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వెళ్తోంది. ఆదివారం నెల్లూరు జిల్లాలోని మనుబోలులో పర్యటించిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ  సభలో మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టిన ఆయన ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చూపిస్తానని గోవర్ధన్ రెడ్డిని హెచ్చరించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 300 కుటుంబాలు మంత్రి సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.

Telugudesam
YSRCP
Somireddy chandra Mohan Reddy
Nellore District
Andhra Pradesh
  • Loading...

More Telugu News