Madhya Pradesh: పెద్ద పులి సుందరికి విముక్తి.. కాపలాగా ఏనుగులు రాజ్‌కుమార్, మహేంద్ర

  • రెండు నెలలుగా బందీగా ఉన్న సుందరి
  • ఆగ్రహం వ్యక్తం చేసిన లుల సంరక్షణ సంస్థ
  • గ్రామాల్లోకి వెళ్లకుండా ఏనుగులతో పహారా

ఒడిశాలోని రాయగడ ఎన్‌క్లోజర్‌లో రెండు నెలలుగా బందీగా ఉన్న పెద్ద పులి సుందరికి త్వరలో విముక్తి లభించనుంది. దేశంలో పులల సంఖ్యను పెంచే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ నుంచి దీనిని తీసుకొచ్చి సాతోకోసియా అడవుల్లో విడిచిపెట్టారు. అయితే, సమీప గ్రామాలకు చెందిన ఇద్దరు గ్రామస్థులను సుందరి చంపి తినడంతో అటవీ అధికారులు దీనిని బంధించారు. పులిని బోనులో బంధించడంపై  జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తిరిగి దీనిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించారు.

గత రెండు నెలలుగా బోనులో బందీగా ఉన్న సుందరిని త్వరలోనే అనుగుల్ జిల్లాలోని సాతోకోసియా అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు అటవీశాఖ మంత్రి బిజయ్‌శ్రీ రౌత్రాయ్ తెలిపారు. పులిని అడవిలో విడిచిపెట్టాక దానికి కాపలాగా రాజ్‌కుమార్, మహేంద్ర అనే ఏనుగులు కాపలాగా ఉంటాయని పేర్కొన్నారు. అటవీ సిబ్బంది ఈ ఏనుగులపై సంచరిస్తూ సుందరిపై నిఘా పెడతారని మంత్రి వివరించారు.

Madhya Pradesh
Odisha
Big Cat
Forest
Bhubaneshwar
  • Loading...

More Telugu News