Daggubati Venkateswara Rao: హితేశ్ భవిష్యత్ కోసం అవసరమైతే పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేస్తారు: దగ్గుబాటి

  • తనయుడితో కలిసి జగన్‌తో దగ్గుబాటి భేటీ
  • బీజేపీకి రాజీనామా చేసినా మరో పార్టీలో పురందేశ్వరి చేరబోరన్న దగ్గుబాటి
  • జగన్ కష్టానికి ఫలితం ఉంటుందని వ్యాఖ్య

కుమారుడు హితేశ్ రాజకీయ భవిష్యత్ కోసం అవసరం అయితే పురందేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకుంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో కుమారుడు హితేశ్ చెంచురామ్‌తో కలిసి జగన్‌తో దగ్గుబాటి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ, జాతీయ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  

అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ.. హితేశ్ రాజకీయ భవిష్యత్‌కు అడ్డంకిగా మారే ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అవసరం అనుకుంటే బీజేపీకి రాజీనామా చేస్తారని తెలిపారు. అంతే తప్ప వేరే పార్టీలోకి వెళ్లబోరని స్పష్టం చేశారు. వైసీపీలో ఎప్పుడు చేరబోతున్నదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. జగన్‌ను తాను రెండేళ్లుగా గమనిస్తున్నానని, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు ఆయనకు ఇస్తాడని దగ్గుబాటి ఆశాభావం వ్యక్తం చేశారు.

Daggubati Venkateswara Rao
Jagan
YSRCP
purandeshwari
Andhra Pradesh
  • Loading...

More Telugu News