modi: మోదీ గారు, మీకు ట్రైలర్ మాత్రమే చూపించాం.. అసలైన సినిమా చూపించబోతున్నాం: నారా లోకేష్

  • కర్ణాటక ఎన్నికల్లో తెలుగువాడి పవర్ చూపించాం
  • ఫెడరల్ ఫ్రంట్ తెలుగు ద్రోహుల ఫ్రంట్
  • ఆ ఫ్రంట్ లో టీఆర్ఎస్, వైసీపీలు మాత్రమే ఉన్నాయి

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పై కక్షగట్టారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజమండ్రిలో జరుగుతున్న జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ,'మోదీ గారు, తెలుగువాడి పవర్ ఏంటో కర్ణాటక ఎన్నికల్లో చూపించాం. అది ట్రైలర్ మాత్రమే. రానున్న ఎన్నికల్లో పూర్తి సినిమా చూపించబోతున్నాం' అని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం గురించి ప్రతిపక్ష నేత జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. జగన్ పేరును జగన్ మోదీ రెడ్డిగా మార్చుకోవాలని సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ పై కూడా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆ ఫ్రంట్ లో కేవలం టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది తెలుగు ద్రోహుల ఫ్రంట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

modi
jagan
nara lokesh
kcr
federal front
jai ho bc
  • Loading...

More Telugu News