Andhra Pradesh: ఏపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన ప్రత్యేక హోదా సాధన సమితి

  • ఫిబ్రవరి 1న ఏపీ బంద్ 
  • సినీ ప్రముఖులు కలసిరావాలన్న చలసాని
  • కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను అంతమొందించేందుకే బంద్

ఫిబ్రవర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా బంద్ లో అన్ని వర్గాలు పాల్గొనాలని విన్నవించారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడ కోసం అన్ని రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులు అందరూ కలసి పోరాడారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా పెద్ద నటులు, నిర్మాతలు ఉన్నారని... వారంతా ప్రత్యేక హోదా కోసం కలసి రావాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను అంతమొందించేందుకే బంద్ కు పిలుపునిచ్చామని చెప్పారు. 

Andhra Pradesh
bandh
special status
  • Loading...

More Telugu News