badminton: ఇండోనేషియన్ మాస్టర్స్ టోర్నీ.. విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్.. కన్నీళ్లు పెట్టుకున్న మారిన్!

  • స్పెయిన్ క్రీడాకారిణి కరోలీనా మారిన్ తో పోరు
  • గాయం కారణంగా తప్పుకున్న స్పెయిన్ స్టార్
  • సైనాను విజేతగా ప్రకటించిన మ్యాచ్ రిఫరీ

ఇండోనేషియన్ మాస్టర్స్ 2019 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది. స్పెయిన్ స్టార్ కరోలీనా మారిన్ తో ఈరోజు జరిగిన ఆటలో సైనా హోరాహోరీగా తలపడింది. అయితే ఆట మధ్యలో కరోలీనా మారిన్ మోకాలికి గాయమయింది. దీంతో అక్కడే కూలబడిపోయిన మారిన్ నొప్పితో అల్లాడిపోయింది. దీంతో కోచ్ సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సపర్యలు చేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ లో కొనసాగడం తనవల్ల కాదని కన్నీటితో మారిన్ చెప్పడంతో రిఫరీ సైనాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ముగిసే సమయానికి మారిన్ సైనాపై 10-4 ఆధిక్యంతో ఉంది.

badminton
saina
carolina mareen
espain
India
sports
indonesian masters 2019
  • Loading...

More Telugu News