Chandrababu: నారా భువనేశ్వరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

  • రాజధానికి సొంత భూమి లేకున్నా.. 33వేల ఎకరాల భూమిని సేకరించాం
  • ఆదాయం లేకున్నా.. సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేశాం
  • ఎక్కడ పెరిగినా.. జన్మనిచ్చిన భూమిని మరిచిపోకూడదు

రాజధాని నిర్మాణానికి సొంత భూమి కూడా లేని పరిస్థితుల్లో పాలన మొదలు పెట్టామని... ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కంటే ముందే పట్టిసీమను పూర్తి చేసి, కృష్టా డెల్టా రైతులను ఆదుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత వరకు తాను చేసిన అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం లేనప్పటికీ... ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేశామని తెలిపారు. రైతులు, కౌలు రైతులను ఆదుకునేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు ఎత్తివేసి వేలాది మందిని ఆదుకున్నామని తెలిపారు.

తన భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరవోలులో చంద్రబాబు ఈరోజు పర్యటించారు. గ్రామంలోని సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పంచాయతీ కార్యాలయం, ఎన్టీఆర్ గృహ సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడ పెరిగినా, జన్మనిచ్చిన ఊరిని మరిచిపోకూడదని చెప్పారు. తన అత్తగారు ఈ గ్రామంలో జన్మించారని.. ఈ ఊర్లో ఆవిడ పుట్టడం ఈ గ్రామం చేసుకున్న అదృష్టమని తెలిపారు. మద్యం, ధూమపాన రహిత గ్రామంగా చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని, అన్ని విధాలా అభివృద్ధి చేసిన నారా భువనేశ్వరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News