yatra: ‘యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్రకు మమ్ముట్టిని అందుకే తీసుకున్నాం!: దర్శకుడు మహి రాఘవ్

  • వైఎస్ గొప్పతనాన్ని చూపించే సినిమా ఇది
  • ఏపీలో ఎవ్వరూ ముందుకు రారని భావించాం
  • మీడియాతో ముచ్చటించిన దర్శకుడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా  మహి.వి. రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం స్టార్ మమ్ముట్టి వైఎస్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే నెల 8న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ పాత్రకు తెలుగు నటులను కాకుండా మమ్ముట్టిని ఎంచుకోవడంపై దర్శకుడు రాఘవ్ స్పందించారు.

వైఎస్ గొప్పతనాన్ని చూపించే సినిమా ‘యాత్ర’ అని దర్శకుడు రాఘవ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో లేదు కాబట్టి, ఇలాంటి సమయంలో ఏ తెలుగు నటుడు కూడా ముందుకు రాడన్న కారణంతోనే తాము మమ్ముట్టిని ఎంచుకున్నామని పేర్కొన్నారు. వైఎస్ పాత్రకు మమ్ముట్టి పూర్తి న్యాయం చేశారని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News