Andhra Pradesh: నటుడు మోహన్ బాబుతో కాపు నేత ముద్రగడ పద్మనాభం భేటీ!

  • దాసరి విగ్రహావిష్కరణకు పిలవకపోవడంపై విచారం
  • ముద్రగడ దాసరికి మంచి మిత్రుడని వ్యాఖ్య
  • పాలకొల్లులో నిన్న దాసరి విగ్రహావిష్కరణ

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈరోజు ప్రముఖ నటుడు మోహన్ బాబుతో భేటీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న మోహన్ బాబును ముద్రగడ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పాలకొల్లులో దాసరి నారాయణ రావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముద్రగడను పిలవకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. దాసరికి ముద్రగడ మంచి మిత్రుడని తెలిపారు. దాసరి నారాయణ రావు అందరివాడనీ, ఆయన ఏ రాజకీయ పార్టీకి పరిమితమైన వ్యక్తి కాదని మోహన్ బాబు అన్నారు. తనకు దాసరి తండ్రిలాంటి వ్యక్తి అని వ్యాఖ్యానించారు. పాలకొల్లులో నిన్న దాసరి కాంస్య విగ్రహాన్ని మోహన్ బాబు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.  

Andhra Pradesh
East Godavari District
dasari narayana rao
mohan babu
kapu
leader
  • Loading...

More Telugu News