Telangana: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 3,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్న టీఎస్ పీఎస్సీ!

  • వారం రోజుల్లోగా నోటిఫికేషన్ విడుదల
  • మీడియాతో టీఎస్ పీఎస్సీ చైర్మన్ చక్రపాణి
  • కోర్టు కేసులతో విమర్శలు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య

తెలంగాణలోని నిరుద్యోగ యువతీయువకులకు టీఎస్ పీఎస్సీ శుభవార్త తెలిపింది. రాబోయే వారం రోజుల్లో 3,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేస్తామని ప్రకటించింది. ఈ విషయమై టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 18,000 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఒక్క 2018లోనే 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు నియామక ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలో ఏకంగా 20,000 ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలు, కోర్టు కేసుల నేపథ్యంలో టీఎస్ పీఎస్సీకి సంబంధం లేకపోయినా  విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు.

Telangana
tspsc
3000 jobs
one week
this week
notification
chairman
ghanta chakrapani
  • Loading...

More Telugu News