Pawan Kalyan: పవన్ కోసం పని మొదలుపెట్టిన నాగబాబు.. కార్యకర్తలు, అభిమానులతో జోరుగా సమావేశాలు

  • గత మూడు రోజులుగా తూగో జిల్లాలో పాగా
  • మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలతో వరుస భేటీలు
  • వచ్చే ఎన్నికల కోసం దిశానిర్దేశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. రానున్న ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం పవన్ అభిమానులను, పార్టీ కార్యకర్తలను కలుస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జోరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. త్వరలో మిగతా జిల్లాల్లోనూ ఆయన పర్యటించనున్నట్టు తెలుస్తోంది.

యూట్యూబ్ చానల్ ద్వారా ఇప్పటికే పని మొదలుపెట్టిన నాగబాబు.. చంద్రబాబు, జగన్, బాలకృష్ణ తదితరులపై సెటైర్లు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఇటీవల నాగబాబు వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు.

తాజాగా, వైసీపీ అధినేత జగన్‌పై మరో వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రానున్న ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

Pawan Kalyan
Naga babu
East Godavari District
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News