Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చిరంజీవి కథానాయికగా తమన్నా 
  • తుది మెరుగులు ఇస్తున్న బోయపాటి
  • మార్చ్ నుంచి తెలుగు '96'

*  తాజాగా 'ఎఫ్ 2' చిత్రంలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కనిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించే చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం తమన్నాను సంప్రదిస్తున్నట్టు సమాచారం.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు బోయపాటి స్క్రిప్టుకి తుదిమెరుగులు దిద్దుతున్నాడట. గతంలో 'సింహా', 'లెజండ్' సినిమాలలో చూపించినట్టుగా ఇందులో కూడా బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. శర్వానంద్, సమంత జంటగా నటించే ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి మొదలవుతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తాడు.

Thamanna
Chiranjivi
Koratala Siva
Balakrishna
Samantha
  • Loading...

More Telugu News