Dasari Narayana Rao: నాకు జన్మనిచ్చింది దాసరే.. భావోద్వేగానికి గురైన నటుడు మోహన్‌బాబు

  • దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు
  • మా కుటుంబం నెత్తిన పాలకొల్లు ప్రజలు పాలుపోశారు
  • మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు వల్లే తానీ స్థాయికి ఎదిగానని.. విలన్‌గా, హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా తనకు జన్మనిచ్చింది ఆయనేనని చెబుతూ నటుడు మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. పాలకొల్లులో శనివారం దాసరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు మాట్లాడుతూ.. తమ కుటుంబం నెత్తిన పాలుపోసింది పాలకొల్లు ప్రజలేనన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన దాసరి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. సగం అరిగిపోయిన చెప్పుల నుంచి షూస్ వేసుకునే అవకాశం కల్పించింది ఆయనేనన్నారు. తనలాగా ఎంతోమందిని సినీ రంగంలో నిలబెట్టిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టమని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Dasari Narayana Rao
Tollywood
Palkol
Director
Mohanbabu
  • Loading...

More Telugu News