YSRCP: వైసీపీకి రాజీనామా చేస్తున్నా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా: 'జమ్మలమడుగు' నేత అల్లే ప్రభావతి

  • జమ్మలమడుగు టికెట్‌ను సుధీర్ రెడ్డికి ప్రకటించిన జగన్
  • ఆశించి భంగపడిన అల్లె ప్రభావతి
  • శనివారం రాత్రి పార్టీకి రాజీనామా

గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కడప జిల్లా మైలవరం మాజీ జడ్పీటీసీ అల్లె ప్రభావతి శనివారం రాత్రి పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు.

తొలి నుంచి జమ్మలమడుగు టికెట్‌ను ఆశిస్తూ వచ్చిన ఆమెకు ఇటీవల అధినేత జగన్ ఝలక్కిచ్చారు. ఇటీవల పాదయాత్ర ముగించుకుని వచ్చిన జగన్ సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ప్రభావతి తనకెందుకు టికెట్ ఇవ్వరంటూ నేరుగా జగన్‌నే నిలదీసినా ఆయన నుంచి సమాధానం రాలేదు.

నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రభావతి శనివారం రాత్రి వైసీపీకి రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, జమ్మలమడుగు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.  

YSRCP
Jagan
Alle prabhavathi
Kadapa
Jammulamadugu
Andhra Pradesh
  • Loading...

More Telugu News