Kodela siva prasada Rao: ప్రతి వాడూ సీఎం కావాలనుకుంటాడు.. ఆఖరికి కేఏ పాల్ కూడా!: కోడెల ధ్వజం

  • నా కొడుకుపై చేస్తున్న ఆరోపణలను నిరూపించగలరా?
  • నేర చరిత్ర ఉన్న జగన్‌ను ఎలా సీఎం చేస్తారు?
  • అసెంబ్లీకి రావాలని వైసీపీ నేతలకు చెప్పా
  • జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించా

ప్రతివాడూ సీఎం కావాలనుకుంటాడని.. ఆఖరికి కేఏ పాల్ కూడా తానే సీఎంని అంటున్నాడని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేర చరిత్ర ఉన్న జగన్‌‌ను ప్రజలు ఎలా సీఎం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్‌ సహా వైసీపీ నేతలెవరైనా తన కొడుకు మీద చేస్తున్న ఆరోపణలను నిరూపించగలరా? అని నిలదీశారు.

'ఆంధ్రా నయీం' అంటూ తన కుమారుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడితో పోటీ చేయించడం ఖాయమని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటానన్నారు. అసెంబ్లీకి రావాలంటూ వైసీపీ నేతలకు ఫోన్ చేసి చెబుతున్నానని.. జగన్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించానన్నారు. కానీ వాళ్లు స్పందించడం లేదని కోడెల వెల్లడించారు. అయితే తమకు అసెంబ్లీకి రావాలని ఉందని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనకు చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు.

Kodela siva prasada Rao
KA Paul
Jagan
YSRCP
Telugudesam
Assembly
  • Loading...

More Telugu News