Kodela sivaprasada Rao: నా మీద కేసులున్న మాట వాస్తవం.. నా ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవం: కోడెల

  • నేను ఎప్పటికీ పల్నాటి పులినే
  • ఫ్యాక్షనిస్ట్ అనడం బాధ కలిగించింది
  • రాధా టీడీపీలోకి వస్తే శుభపరిణామమే

తనపై కేసులున్న మాట వాస్తవమేనని.. అవన్నీ రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన కేసులేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవమేనని, కానీ వాటిని ఎవరో కావాలని పెట్టినవని తెలిపారు. వంగవీటి రాధా టీడీపీలోకి వస్తే శుభపరిణామమేనని.. ఎవరైనా పార్టీలోకి రావచ్చని అన్నారు.

వైసీపీలో ఇమడలేక చాలా మంది టీడీపీలోకి వస్తున్నారని కోడెల పేర్కొన్నారు. బ్యాట్స్‌మెన్ అయిన తనను అంపైర్ స్థానంలో కూర్చోబెట్టినందుకు ఏనాడూ బాధపడలేని తెలిపారు. తాను ఫ్యాక్షనిస్టుని అయితే తన మీదే నాలుగుసార్లు హత్యాయత్నం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. తనను ఫ్యాక్షనిస్ట్ అనడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ పల్నాటి పులినేనని కోడెల స్పష్టం చేశారు.

Kodela sivaprasada Rao
Vangaveeti Radha
YSRCP
Telugudesam
Factionist
  • Loading...

More Telugu News