KCR: గవర్నర్ తేనేటి విందులో ముచ్చట్లు: అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్.. మధ్యలో పవన్!

  • సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా పవన్
  • ముగ్గురి మధ్య అరగంటకు పైగా చర్చ
  • ప్రస్తుత రాజకీయాలపై సంభాషణ

రిపబ్లిక్ డే సందర్భంగా నేటి సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మధ్యలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూర్చున్నారు.
 ఈ ముగ్గురి మధ్య ప్రస్తుత రాజకీయాలపై దాదాపు అరగంట పాటు చర్చ జరిగినట్టు సమాచారం. ఇటీవల కేటీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీపై కామెంట్స్ చేసిన పవన్.. నేడు కేసీఆర్, కేటీఆర్‌లతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఈ తేనీటి విందుకు మాజీ సీఎం రోశయ్య, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ తదితరులు హాజరయ్యారు.
 

KCR
KTR
Narasimhan
Pawan Kalyan
Rosaiah
KE Krishna murthy
Mahmood Ali
  • Loading...

More Telugu News