mizoram: జనాలు లేని ప్రదేశంలో మిజోరాం గవర్నర్ గారి ప్రసంగం!

  • పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా మిజోరాంలో నిరసన
  • రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరించాలంటూ పలు సంస్థల పిలుపు
  • వేడుకలకు హాజరు కాని జనం

మిజోరాం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు సంస్థలు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాయి. వేడుకలకు ప్రజలెవరూ హాజరుకావద్దంటూ పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ప్రజలు హాజరు కాలేదు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో, జనాలు లేక ఖాళీగా ఉన్న మైదానంలోనే గవర్నర్ ప్రసంగించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రాలు, ఇతర ప్రదేశాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జనాలు లేకుండానే జెండాను ఎగురవేయాల్సి వచ్చింది.

mizoram
Republic Day
governor
  • Loading...

More Telugu News