Tollywood: అయాన్, అర్హాతో కలిసి రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్!

  • కుమారుడు అయాన్, కుమార్తె అర్హాతో సందడి
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటుడు
  • త్వరలో త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్

టాలీవుడ్ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు అయాన్, కుమార్తె అర్హాతో కలిసి ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల లవర్స్ డే(మలయాళంలో ఒరు అదార్ లవ్) సినిమా ఆడియో వేడుకలకు బన్నీ హాజరైన సంగతి తెలిసిందే. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Tollywood
Allu Arjun
republic day
family
Twitter
Social Media
  • Loading...

More Telugu News