Telangana: హైదరాబాద్ పై కరుణించిన వరుణుడు.. వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలు!

  • కూకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ లో వర్షం
  • వీకెండ్ కావడంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ఇన్నాళ్లూ చలితో వణికిన భాగ్యనగరంపై వరుణుడు కరుణించాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. వీకెండ్ తో పాటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో హైదరాబాద్ వాసులు కుటుంబంతో కలిసి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. తెలంగాణలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangana
Hyderabad
rain
people enjoy
kukatpally
ameerprt
banjarahills
jublee hills
hitech city
  • Loading...

More Telugu News