surya: సూర్య మూవీ టీజర్ కి ముహూర్తం ఖరారు

- సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే'
- ఫిబ్రవరి 14వ తేదీన టీజర్ రిలీజ్
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల
సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' చిత్రం రూపొందింది. ఇటీవలే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలో సూర్య కనిపించనున్నాడు. ఈ సినిమా తమిళ టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
