chiranjeevi: చిరూ, కొరటాల సినిమాలో నయన్, తమన్నా?

  • 'సైరా' పనులతో బిజీగా చిరంజీవి
  • స్క్రిప్ట్ సిద్ధం చేసిన కొరటాల
  • మార్చిలో సెట్స్ పైకి  

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' షూటింగులో బిజీగా వున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలావరకూ చిత్రీకరించారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొరటాల ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేసేశాడు. ఫైనల్ గా చిరంజీవికి ఒకసారి వినిపించి లాక్ చేయనున్నారు.

ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన కథానాయికగా మొదటి నుంచి కూడా నయనతార పేరే వినిపిస్తోంది. డేట్స్ సర్దుబాటు చేయవలసి ఉంటుందనీ .. ఆల్రెడీ కమిట్ అయిన దర్శక నిర్మాతలతో మాట్లాడి ఏ విషయమూ చెబుతానని నయనతార అందట. ఇక మరో కథానాయికగా తమన్నాతోను సంప్రదింపులు జరుగుతున్నాయట. తమన్నాకి పెద్దగా అవకాశాలు లేవు గనుక, ఆమె ఓకే అనడానికి సిద్ధంగా ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ నయనతారకి కుదరకపోతే మరో సీనియర్ కథానాయికను వెంటనే తీసుకునేలా సిద్ధంగా వుండాలని కొరటాలతో చరణ్ చెప్పినట్టుగా సమాచారం. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

chiranjeevi
tamannah
nayan
  • Loading...

More Telugu News