Train Accident: అజాగ్రత్త ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది!

  • రైలు ఢీకొట్టి యువతి దుర్మరణం
  • ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దుర్ఘటన
  • ఆగ్రా నగరంలో ఘటన

అజాగ్రత్త ఆ యువతి ప్రాణాలమీదికి తెచ్చింది. సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ తనను తాను మర్చిపోయిన ఆమె రైలు ఢీకొట్టిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యింది. పోలీసుల కథనం మేరకు...ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రా నగరం శివారు ఈశ్వర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పూనం యాదవ్‌ పోస్టుగ్రాడ్యుయేషన్‌ చదివింది. ప్రస్తుతం బ్యాంక్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న పూనం స్నేహితులతో కలిసి శిక్షణ తీసుకుంటోంది.

శుక్రవారం ఎప్పటిలా శిక్షణ కోసం వెళ్లి వస్తూ ఆగ్రా రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫుట్‌ ఓవర్‌ రైలు వంతెన కింద నుంచి పట్టాలు దాటుతోంది. అదే సమయంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నప్పుడు రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Train Accident
uattarapradesh
agra
girl died
  • Loading...

More Telugu News