Malayalam porn star: అజ్ఞాతంలో మలయాళ చిత్రాల శృంగారతార రేష్మ.. చనిపోయి ఉండొచ్చంటూ వదంతులు

  • 12 ఏళ్లుగా మాయమైన రేష్మ
  • చనిపోయిందంటూ పుకార్లు
  • భర్తతో హ్యాపీగా ఉందన్న షకీలా

ఒకప్పుడు మోతాదు మించిన శృంగార మలయాళ చిత్రాలల్లో నటించిన రేష్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె చనిపోయిందంటూ వదంతులు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు షకీలాతో సమానంగా మలయాళ సినీ పరిశ్రమను ఏలిన రేష్మ పుష్కర కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

షకీలా కూడా ఒకప్పుడు శృంగారతారే అయినా ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో ఆఫర్లు అందిపుచ్చుకోవడం ద్వారా కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. అయితే, ఈ విషయంలో వెనకబడిన రేష్మ గత పన్నెండేళ్లుగా ఎవరినీ కలవకపోవడం గమనార్హం. మల్లు శృంగార చిత్రాల్లో నటించేందుకు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన నటి అకస్మాత్తుగా అదృశ్యం కావడంపై మాలీవుడ్‌లో చర్చకు కారణమైంది.  

2007లో ఓ సెక్స్ రాకెట్ కేసులో చిక్కుకుని బెయిలుపై విడుదలైన రేష్మ ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. ఆమె చనిపోయి ఉండొచ్చన్న వదంతులు కూడా వినిపించినా అందుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి స్థిరపడి ఉండొచ్చన్న మరో వాదన వినిపిస్తోంది. మిస్టరీగా మారిన ఆమె అదృశ్యంపై తాజాగా సహనటి షకీలా స్పందించింది.

రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. గతంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఆమె చనిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

Malayalam porn star
Reshma
Shakila
Mysore
Actress
  • Loading...

More Telugu News