Model Mansi dixit: కోరికను తీర్చలేదనే మోడల్‌ను చంపేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు

  • గతేడాది అక్టోబరు 15న హత్య
  • కోరికను తీర్చలేదన్న కసితో గొంతుకు తాడు బిగించి చంపేసిన నిందితుడు
  • చార్జిషీటు దాఖలు చేసిన ముంబై పోలీసులు

గొప్ప మోడల్‌గా ఎదగాలన్న వర్ధమాన మోడల్ మన్సీ దీక్షిత్ (20)ను ఎందుకు చంపేసిందీ నిందితుడు వెల్లడించాడు. తన కోరికను తీర్చడానికి నిరాకరించిందన్న కోపంతోనే ఆమెను హత్య చేసినట్టు పోలీసు విచారణలో నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ (19) పోలీసులకు తెలిపాడు. గతేడాది అక్టోబరు 15న ముంబైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

మోడల్‌తో పరిచయం పెంచుకున్న ఫొటోగ్రాఫర్ ముజమ్మిల్ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ఫొటోలు తీసే నెపంతో తన ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన ఆమె వద్ద తన కోరికను బయటపెట్టాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ స్టూలుతో తలపై కొట్టాడు. అనంతరం ఆమె మెడను తాడుతో బిగించి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి, క్యాబ్ బుక్ చేసుకుని తీసుకెళ్లి ఓ ఫుట్‌పాత్ వద్ద పడేసి వెళ్లిపోయాడు.

అయితే, సంచిలో మృతదేహం ఉందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అతడిచ్చిన సమాచారంతో నిందితుడు ముజమ్మిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, జరిగిన విచారణలో నిందితుడు అసలు విషయాలు వెల్లడించాడు. తన కోరికను నిరాకరించినందుకే ఆమెను హతమార్చినట్టు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.  

Model Mansi dixit
Syed Muzzammil Hasan
Mumbai
Maharashtra
  • Loading...

More Telugu News