Brazil: బ్రెజిల్‌లో కూలిన ఆనకట్ట.. ఏడుగురి మృతి, 200 మంది గల్లంతు

  • బురద తాకిడికి కుప్పకూలిన డ్యామ్
  • పరిసర గ్రామాలను ముంచెత్తిన నీరు, బురద
  • గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లతో గాలింపు

ఆగ్నేయ బ్రెజిల్‌లో ఓ ఆనకట్ట కుప్పకూలిన ఘటనలో ఏడుగురు చనిపోగా 200 మందికిపైగా గల్లంతయ్యారు. మినాస్ గెరాయిస్ రాష్ట్రంలోని బెలో హారిజాంటేలో ఐరన్ ఓర్ గని సమీపంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జి కూలిపోవడంతో నీళ్లు మొత్తం సమీపంలోని గ్రామాలను ముంచెత్తాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.  గ్రామాలు బురదమయంగా మారాయి. డ్యామ్ కెఫెటేరియాలో లంచ్ చేస్తున్న కార్మికులు నీటిలో కొట్టుకుపోయారు. బురద వారిని కప్పేసింది.

వరదలా దూసుకొచ్చిన బురద తాకిడి వల్లే ఆనకట్ట కూలినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. మినాస్ గెరాయిస్‌లోనే ఓ పట్టణంలో డ్యామ్ కూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News