Loksatta: మాజీ ప్రధాని పీవీ పేరుపై స్వచ్ఛంద సంస్థ అవార్డు.. తొలి అవార్డుకు మన్మోహన్‌ సింగ్ ఎంపిక

  • ప్రకటించిన జయప్రకాశ్ నారాయణ
  • వచ్చే నెల 28న ఢిల్లీలో ప్రదానం
  • దేశం దశను పీవీ మార్చారంటూ ప్రశంసలు

చెన్నైకి చెందిన ఇండియా నెక్స్ట్ అనే స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మెమోరియల్ నేషనల్ లీడర్ షిప్ అండ్ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తితో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 28న ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు రామచంద్రమూర్తి తెలిపారు. కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. దేశం ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేశం దిశ, దశ మార్చిన గొప్ప నాయకుడు పీవీ అని కొనియాడారు.

Loksatta
Jayaprakash Narayan
PV Narasimharao
Manmohan singh
New Delhi
  • Loading...

More Telugu News