Pranab Mukherjee: 14 మందికి పద్మభూషణ్.. 94 మందికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం

  • పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
  • ముగ్గురికి భారతరత్న
  • నలుగురికి పద్మవిభూషణ్

పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను నేడు ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.

భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు టీజెన్‌బాయ్‌, అనిల్‌కుమార్‌ మణీబాయ్‌, ఇస్మాయిల్‌ ఒమర్‌ గులే, బల్వంత మోరేశ్వర్‌ పురంధేరలు ఎంపికయ్యారు. 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.

Pranab Mukherjee
Tijenbai
Anil kumar Manibai
Ismail Omar Gule
Balvantha Moreswar
  • Loading...

More Telugu News