Adilabad District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

  • ఓడిపోవడం రెండోసారి
  • పురుగుల మందు తాగిన కళాబాయి
  • రిమ్స్‌కు తరలించిన కుటుంబ సభ్యులు

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గుడిహత్నూర్ మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన పవార్ కళాబాయి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె ఇలా ఓడిపోవడం ఇది రెండోసారి. దీంతో మనస్తాపం చెందిన కళాబాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Adilabad District
Gudihatnur
Kalabai
Suicide
Rims
  • Loading...

More Telugu News