Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న.. నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాలకు కూడా!
- 2012-2017 వరకూ రాష్ట్రపతిగా ప్రణబ్
- రక్షణ, ఆర్థిక మంత్రిగా సేవలు
- మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా పేరు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నేడు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రకటించింది. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ నేత, దివంగత నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ జానపద గాయకుడు దివంగత భూపెన్ హజారికాలకు మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. దేశానికి అత్యున్నత సేవలందించినందుకుగాను.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్నను అందజేస్తారు.
1935 డిసెంబర్ 11న జన్మించిన ప్రణబ్.. రక్షణ మంత్రిగా, ఆర్థికమంత్రిగా.. అనంతరం 2012 నుంచి 2017 వరకూ భారత రాష్ట్రపతిగా సేవలందించారు. అంతేకాకుండా మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా కూడా మంచి పేరుంది. భూపేన్ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు.