Kajal Agarwal: 'సీత' టైటిల్ లోగోను రిలీజ్ చేసిన తేజ

  • తేజ దర్శకత్వంలో కాజల్ 
  • కాజల్ జోడీగా బెల్లంకొండ
  • వేసవిలో విడుదల

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ జంటగా ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రమనీ .. ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'సీత' అనేది వర్కింగ్ టైటిల్ కావొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ టైటిల్ నే తేజ ఖరారు చేసి .. కొంత సేపటి క్రితం టైటిల్ లోగోను వదిలాడు.

 'సీత' అనే టైటిల్ లోగోను చాలా అందంగా ఆయన డిజైన్ చేయించాడు. ఈ టైటిల్ ను బట్టి .. ముందుగా అనుకున్నట్టుగానే ఇది నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా అని స్పష్టమవుతోంది. రేపు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రానుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు. కాజల్ తొలిసారిగా చేస్తోన్న నాయిక ప్రాధాన్యత గల ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

  • Loading...

More Telugu News