BJP: బీజేపీపై మండిపడ్డ మమతా బెనర్జీ.. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆగ్రహం!

  • దేశంలో ఎవ్వరినీ విడిచిపెట్టలేదు
  • బీజేపీ నేతలు భయపడ్డారా? అంటూ ప్రశ్న 
  • ట్విట్టర్ లో స్పందించిన బెంగాల్ సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వరకూ.. ఎవ్వరినీ బీజేపీ విడిచిపెట్టలేదని విమర్శించారు. దేశంలో తూర్పు నుంచి పడమర వరకూ, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ తమ రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో మమతా బెనర్జీ స్పందిస్తూ..‘అఖిలేశ్ నుంచి మాయావతి వరకూ, తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ బీజేపీ ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారు. బీజేపీ నేతలు భయపడ్డారా? ఆశలు సన్నగిల్లాయా?’ అని ట్వీట్ చేశారు.

BJP
Narendra Modi
mamata
TMC
sp
akhilesh yadav
bsp
mayavati
political vandetta
harrasment
Twitter
  • Loading...

More Telugu News