Canada: ప్రయాణికులకు అస్వస్థత...అత్యవసరంగా ల్యాండ్ అయిన కెనడా విమానం
- కెనడా నుంచి బయలు దేరిన విమానం
- టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణికులకు వాంతులు, వికారం
- మొత్తం 185 మందికీ ఇబ్బందులు
కెనడా నుంచి బయల్దేరిన ఓ విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే అందులోని 185 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురవ్వడంతో అదే దేశంలో మరో విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. వివరాల్లోకి వెళితే...కెనడా రాజధాని ఒట్టావా విమానాశ్రయం నుంచి ఫోర్ట్ లాడర్డేల్క్ ఎయిర్ 782 విమానం 185 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయింది.
అయితే, కాసేపటికే ప్రయాణికులందరి కళ్లు దురద పెట్టడంతో పాటు, వికారం, వాంతులు మొదయ్యాయి. ఏం జరిగిందో అర్థంకాని సిబ్బంది అత్యవసరంగా క్యూబెక్ విమానాశ్రయంలో విమానాన్ని దింపేశారు. పది మంది ప్రయాణికుల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించి మిగిలిన వారికి విమానాశ్రయంలోనే చికిత్స అందిస్తున్నారు. విమానంలోని గాలిలో నాణ్యత కొరవడడంతో ఇటువంటి సమస్య తలెత్తిందని, వెంటిలేషన్ ఇబ్బందులే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.