Andhra Pradesh: చాలా పార్టీల నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటా!: మాజీ మంత్రి కొణతాల

  • ఏపీ విభజన హామీలు అమలుచేయలేదు
  • కేంద్రం రాష్ట్రంపై విపక్ష చూపుతోంది
  • ఈ నెల 27న రైలు యాత్ర నిర్వహిస్తాం

తమతో కలిసి పనిచేయాలని చాలా రాజకీయ పార్టీల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని ఏపీ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవీ ఇంకా అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఏపీకి ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకుపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కొణతాల మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం విపక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 27న విశాఖ నుంచి రైలు యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖ-ఢిల్లీ రైలు యాత్ర తర్వాత అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం కొణతాల ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ గా ఉన్నారు.

Andhra Pradesh
political parties
offers
konatala
ramakrishna
  • Loading...

More Telugu News