Chandrababu: మోదీ ఇంటికెళ్లే టైమొచ్చింది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • నరేంద్ర మోదీది ప్రజా వ్యతిరేక పాలన
  • ఇంకా భరాయించేందుకు ఎవరూ సిద్ధంగాలేరు
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన పదవిని వదిలి ఇంటికి పోయే సమయం ఆసన్నమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన, ప్రస్తుతం దేశంలో సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మారుమోగుతోందని అన్నారు.

 నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక పాలనను దేశ ప్రజలు మరింతకాలం భరాయించేందుకు సిద్ధంగా లేరని అన్నారు. రైతులు, మహిళలు, యువతీ యువకులు బీజేపీ, వైసీపీకి దూరంగా ఉన్నారని అభిప్రాయపడ్డ ఆయన, సమీప భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు ఓటమి తప్పదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను గురించి ప్రజలకు చెప్పాలని, మరోసారి అధికారం ఇస్తే, ఇంతకు రెట్టింపు అభివృద్ధిని చూపిస్తామన్న భరోసాను ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Chandrababu
Narendra Modi
Tele Conference
Jagan
  • Loading...

More Telugu News