TRS: తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్... చాలా ఆనందంగా ఉందన్న కేటీఆర్!
- టీఆర్ఎస్ కు 16, ఎంఐఎంకు ఒకటి
- ఎన్డీయే, యూపీఏలకు స్థానం లేదు
- 'రిపబ్లిక్ వరల్డ్ డాట్ కామ్' అంచనా
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ఆ పార్టీకి 16 సీట్లు, ఎంఐఎంకు ఒక్క సీటు దక్కుతాయని, మరే పార్టీకీ రాష్ట్రంలో చోటు లేదని 'రిపబ్లిక్ వరల్డ్ డాట్ కామ్' ప్రకటించగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలను చూసి తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
కాగా, తెలంగాణలో టీఆర్ఎస్ కు 42.4 శాతం ఓట్లు వస్తాయని, యూపీఏకు 29 శాతం ఓట్లు, ఎన్డీయేకు 12.7 ఓట్లు, ఎఐఎంఐఎంకు 7.7 శాతం ఓట్లు, ఇతరులకు 8.2 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్ వరల్డ్ వెల్లడించింది. లోక్ సభ ఎన్నికలు జనవరిలో జరిగిన పక్షంలో ఈ ఫలితాలు రావచ్చని అంచనా వేసింది.
Delighted that Republic-CVoter survey is predicting a clean sweep of 16 Loksabha seats for TRS in Telangana https://t.co/TAPtdcJwTk
— KTR (@KTRTRS) January 24, 2019