BSP: బీజేపీ ఎమ్మెల్యే తలనరికి తెస్తే రూ.50 లక్షలు ఇస్తానన్న బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  • మాయావతిని హిజ్రా కంటే దారుణమన్న బీజేపీ ఎమ్మెల్యే
  • ఆమె తలకు భారీ నజరానా ప్రకటించిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే
  • కేసు నమోదు చేసిన పోలీసులు

బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ తల నరికి తెచ్చిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే విజయ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా యాదవ్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మొఘల్‌సరాయ్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సాధనా సింగ్ మాట్లాడుతూ మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాయావతి హిజ్రా కంటే దారుణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత్రిపై సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యలపై యాదవ్ అంతే తీవ్రంగా స్పందించారు. ఆమె తల నరికి తెచ్చిచ్చిన వారికి రూ. 50 లక్షలు బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు దర్యాప్తు అధికారి అవదేశ్ సింగ్ తెలిపారు.

BSP
Mayawathi
Sadhana singh
BJP
Vijay yadav
Police
Uttar Pradesh
  • Loading...

More Telugu News