Indira Gandhi: ఇందిరాగాంధీతో ఒప్పులకుప్ప ఆడుతున్న ప్రియాంక.. 40 ఏళ్లనాటి ఫొటోను షేర్ చేసిన కాంగ్రెస్

  • ఇందిర-ప్రియాంక ఒకటేనని చెప్పే ఉద్దేశం
  • కుటుంబ ఆల్బం నుంచి తీసి మరీ షేర్ చేసిన వైనం
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్

యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పడడానికి ఆమె చరిష్మా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చిన దగ్గరి నుంచి ఆమెను నానమ్మ ఇందిరా గాంధీతో పోలుస్తున్నారు. ఆమె ఆహార్యం అచ్చం ఇందిరలా ఉండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

ఇందిర కుటుంబ ఆల్బం నుంచి తీసి మరీ దీనిని షేర్ చేశారు. నానమ్మ ఇందిరా గాంధీతో ప్రియాంక ‘ఒప్పుల కుప్ప’ ఆట ఆడుతున్న ఫొటో అది. ప్రియాంక గాంధీలో ఇందిరను చూపించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ ఫొటోను కాంగ్రెస్ పోస్టు చేసింది. ‘శక్తి సంపన్నులైన మహిళలు శక్తిసంపన్నులనే ప్రోత్సహిస్తారు’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ తగిలించింది. ‘నానమ్మ లానే మనవరాలు కూడా’, ‘కుటుంబం-ప్రేమ-మహిళా సాధికారత’ అన్న ట్యాగ్ లైన్లు కూడా ఈ ఫొటోకు తగిలించింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Indira Gandhi
priyanka Gandhi
Congress
Instagram
Photo
Sonia Gandhi
  • Loading...

More Telugu News