Chandrababu: బీసీలే నా హైకమాండ్.. వారు ఏం చెప్తే అది చేస్తా: చంద్రబాబు

  • జీవితాంతం రుణపడి ఉంటా
  • అధికార గర్వం లేదు
  • కొన్ని వర్గాలు కొన్నిసార్లే ఓటు వేశారు
  • బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగాలి

బీసీలే తన హై కమాండ్ అని.. వారు ఏం చెబితే అదే  చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు ఆయన ఉండవల్లిలోని ప్రజావేదికలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న 'జయహో బీసీ' సదస్సుపై చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అధికార గర్వం కానీ.. ఏమరుపాటు కానీ లేవని.. వెనుకబడిన వర్గాలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కొన్ని వర్గాలు కొన్నిసార్లే టీడీపీకి ఓటు వేశాయని.. బీసీలు మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉన్నారన్నారు. అలాంటి బీసీలను మరచిపోతే తనను తాను మరిచిపోయినట్టేనని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ గ్రూపుల్లో మార్పులు, రిజర్వేషన్ల శాతంపై చర్చ జరగాలన్నారు.

Chandrababu
Vundavalli
Rajamahendravaram
Telugudesam
BC Reservations
  • Loading...

More Telugu News