kl rahul: హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లకు ఊరట!

  • మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, రాహుల్
  • నిషేధం విధించిన పాలకమండలి
  • తాజాగా నిషేధం ఎత్తివేత

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నియమించిన పాలకమండలి ఎత్తివేసింది. వీరిద్దరిపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బీసీసీఐ సహా, పలువురు మాజీ క్రికెటర్లు పాలకమండలిని కోరారు. తాజాగా వీరిద్దరిపై నిషేధాన్ని ఎత్తివేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో మహిళల పట్ల వీరిద్దరూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపై వేటు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిని అర్థాంతరంగా బీసీసీఐ వెనక్కి పిలిపించింది. న్యూజిలాండ్ టూర్ కు కూడా వీరిని ఎంపిక చేయలేదు.

kl rahul
hardhik pandya
bcci
ban
team india
coffe with karan
  • Loading...

More Telugu News