Gurgaon: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురి మృతి

  • పనిలో 20 మంది కూలీలు
  • నాలుగో అంతస్తు నిర్మిస్తుండగా ప్రమాదం
  • ఇద్దరిని కాపాడిన స్థానికులు 

నాలుగు అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు మృతి చెందిన ఘటన గుర్గావ్‌లో జరిగింది. ఉల్లాస్ ప్రాంతంలో ఓ భవనంకి చెందిన నాలుగో అంతస్తు నిర్మిస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 20 మంది వరకూ కూలీలు పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు.

అయితే ఈరోజు ఆ బిల్డింగ్ ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆరుగురు మృతి చెందగా, శిథిలాల నుంచి ఇద్దర్ని కాపాడారు. ప్రస్తుతం బుల్డోజర్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. దీనికోసం ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. భవనం యజమాని, కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

Gurgaon
Building
Died
Police
  • Loading...

More Telugu News