Papireddy: ఎంట్రన్స్ పరీక్ష తేదీల్లో మార్పులు.. వీసీలు, కన్వీనర్లతో టీఎస్ ఉన్నత విద్యామండలి చైర్మన్ సమావేశం
- మే 26న జరగాల్సిన లాసెట్‌లో మార్పు
- ఎడ్‌సెట్ ఒకే రోజు నిర్వహించాలని నిర్ణయం
- ఎంట్రన్స్ ఫీజులు కన్వీనర్లే నిర్ణయిస్తారు
తెలంగాణ కామన్ ఎంట్రన్స్ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేడు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నిర్వహణపై వీసీలు, కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. మే 26న జరగాల్సిన లాసెట్.. కాస్త ముందుకు వచ్చింది. ఈ పరీక్ష మే 20నే జరగనుంది. మే 28న జరగాల్సిన పీజీ ఈసెట్‌ను 31కి మార్చారు.
దీనిపై పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎంట్రన్స్ ఫీజులు ఎంత ఉండాలనేది ఆయా సెట్ల కన్వీనర్లు నిర్ణయిస్తారని వెల్లడించారు. ఎడ్‌సెట్ రెండు రోజులు కాకుండా ఒకే రోజు నిర్వహించాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. సమన్వయం కోసం ప్రతి సెట్‌కి టీసీఎస్ నుంచి ఎంప్లాయీని అటాచ్ చేయాలని కోరినట్టు తెలిపారు.