anil ravipudi: పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇస్తే మేజిక్ చేయడానికి నేను రెడీ: అనిల్ రావిపూడి

  • పవన్ ను నేరుగా కలవలేదు
  • ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను
  •  ఆ మూవీ రామ్ తో చేయవలసింది

అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ, దర్శకుడిగా అనిల్ రావిపూడి తన సత్తా చాటుకుంటున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'గబ్బర్ సింగ్'లో పవన్ కల్యాణ్ ను హరీశ్ శంకర్ ఒక రేంజ్ లో చూపించాడు. మళ్లీ పవన్ ను ఆ రేంజ్ లో చూపించే సత్తా మీకే ఉందనిపిస్తోంది .. మరి మీకేమనిపిస్తోంది?' అనే ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .." నా పట్ల మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ .. నేను ఇంతవరకూ పవన్ కల్యాణ్ గారిని ఎప్పుడూ నేరుగా కలవలేదు .. అలాంటి అవకాశం రాలేదు. నిజంగా మీరన్నట్టుగా ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను. నన్ను నేను నిరూపించుకునేలా మేజిక్ చేయడానికి రెడీగా వున్నాను" అన్నాడు. ఇక హీరో రామ్ ప్రస్తావన రాగా .." రామ్ తో 'రాజా ది గ్రేట్' చేయవలసింది .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు" అని చెప్పుకొచ్చాడు.

anil ravipudi
pavan
  • Loading...

More Telugu News