Sonia Gandhi: సోనియా కుటుంబం మెదక్ నుంచి పోటీ చేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా కేసీఆర్ సహకరించాలి: జగ్గారెడ్డి

  • మెదక్ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం
  • రాహుల్ మంచి వ్యూహకర్త
  • ప్రియాంక ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది

రాహుల్ గాంధీ కానీ, ప్రియాంకగాంధీ కానీ మెదక్ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా... వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహకరించాలని అన్నారు. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి రాహుల్, ప్రియాంకల్లో ఒకరిని పోటీ చేయించే అంశంపై ఏఐసీసీకి లేఖ రాస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ మంచి వ్యూహకర్త అని... దేశ ప్రజల మనసులను ఆయన చూరగొంటున్నారని తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని... ఆయనను వ్యతిరేకిస్తే రాహుల్ ను వ్యతిరేకించినట్టేనని చెప్పారు.

ప్రియాంకకు దేశంలో మంచి క్రేజ్ ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ప్రియాంక రాక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని... ఆమెలో ఇందిరను చూసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కూడా ప్రియాంక ప్రభావం ఉంటుందని చెప్పారు.

Sonia Gandhi
Rahul Gandhi
priyanka gandhi
jagga reddy
kcr
TRS
congress
medak
  • Loading...

More Telugu News