raghuveera reddy: మా నాయకుడి బొమ్మ పెట్టుకుని మాపైనే ఆరోపణలు చేస్తారా?: వైసీపీపై రఘువీరా ఫైర్

  • తిన్నింటి వాసాలు లెక్క పెట్టే సంస్కృతి వైసీపీదే
  • రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఎంత ముట్టింది?
  • తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతిచ్చినందుకు ఎంత అందిందో జగన్ చెప్పాలి

కాంగ్రెస్ పార్టీపై వైసీపీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.

తమ నాయకుడి (వైయస్) బొమ్మ పెట్టుకుని తమపైనే విమర్శలు చేస్తారా అంటూ దుయ్యబట్టారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే సంస్కృతి వైసీపీదేనని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ పార్టీ నుంచి ఎంత ముట్టిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా... టీఆర్ఎస్ కు మద్దతిచ్చినందుకు ఎంత ముట్టిందో కూడా చెప్పాలని అడిగారు.

raghuveera reddy
congress
Telugudesam
ysrcp
jagan
TRS
bjp
  • Loading...

More Telugu News